
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఎనిమిదో నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 20వేల కోట్లు నేరుగా జమకానున్నాయి. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తోపాటు పలువురు అధికారులు పాల్లొన్నారు. ఐదెకరాల లోపు భూమి ఉన్నరైతులకు ఏడాది రూ. వేల చొప్పున ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2వేల చొప్పున సాయాన్ని కేంద్రం విడుదల చేస్తోంది.