Rivaba Ravindra Jadeja : మరో రెండు రోజుల్లో దీపావళి పండుగ. ఈ పండగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. దీపావళి సందర్భంగా యాజమాన్యాలు తమ ఉద్యోగులకు కానుకలు ఇస్తుంటాయి. మిఠాయి పొట్లాలు ఇచ్చి వారిని సంతోష పరుస్తుంటాయి. దీపావళి పండుగ ఇంకా రెండు రోజులు ముందు ఉండగానే.. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఊహించని బహుమతి ఇచ్చారు. దీంతో రవీంద్ర జడేజా ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు.
రవీంద్ర జడేజా ఫేమస్ క్రికెటర్. అతని భార్య పేరు రివాబా.. ఇటీవల ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. భారతీయ జనతా పార్టీ తరఫున గుజరాత్ రాష్ట్రంలో శాసనమండలి సభ్యురాలిగా గెలిచారు. అప్పట్లో ఆమె తరఫున జడేజా కూడా ప్రచారం చేశారు. జడేజా కు ప్రధానమంత్రి తో నేరుగా సంబంధాలు ఉన్న నేపథ్యంలో కోరుకున్న నియోజకవర్గ టికెట్ ఆయన భార్యకు లభించింది. ప్రచారంలో జడేజా ముందు వరుసలో ఉండడంతో ఆమె గెలుపు కూడా సులభం అయిపోయింది. ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఊహించని బహుమతి ఇచ్చారు . దీంతో రవీంద్ర జడేజా కుటుంబం ముందుగానే దీపావళి పండుగ జరుపుకుంటున్నది.
గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులు మొత్తం రాజీనామా చేశారు. దీంతో అక్కడ శుక్రవారం నూతన క్యాబినెట్ ఏర్పడింది. ఈ క్యాబినెట్లో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు క్రీడా శాఖ మంత్రి పదవి ఇచ్చింది. దీంతో రవీంద్ర జడేజా సతీమణి రివాబా క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రవీంద్ర జడేజా ఆడే మ్యాచ్ లకు రివాబా హాజరవుతుంటారు. ఆయనను ఉత్సాహపరిస్తుంటారు. పైగా ఆమెకు మొదటి నుంచి కూడా క్రీడలు అంటే చాలా ఇష్టం. అందువల్లే ఆమెను క్రీడా శాఖ మంత్రిని చేశారని తెలుస్తోంది. మరోవైపు తన భార్యకు మంత్రి పదవి ఇప్పించుకోవడంలో రవీంద్ర జడేజా తెర వెనుక కృషి చేశారని తెలుస్తోంది. అటు ప్రధానమంత్రి తో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్లే రవీంద్ర జడేజా భార్యకు మంత్రి పదవి దక్కిందని తెలుస్తోంది.
రవీంద్ర జడేజా భార్యకు క్రీడా శాఖ మంత్రి పదవి రావడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మధ్య రవీంద్ర జడేజా భార్యపై విమర్శలు వినిపించాయి. రవీంద్ర జడేజా భార్యపై అతడి తండ్రి తీవ్ర విమర్శలు చేశారు. రివాబా వల్ల రవీంద్ర జడేజా తనకు దూరమయ్యాడని అతడి తండ్రి ఆరోపించాడు. ఈ వ్యవహారం పై రవీంద్ర జడేజా నోరు మెదపలేదు. జడేజా కూడా తన కుటుంబాన్ని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం రకరకాల ఆరోపణలకు కారణమైంది.