హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పీవోపీతో చేసిన విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. నిమజ్జనానికి సమయం తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేమని కోరింది. దీంతో ఈ ఏడాదికి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతులు మంజూరు చేసింది.