
తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు. సోమవారం ఉదయం మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావును కలిసి పరామర్శించనున్నారు. తర్వాత పీవీ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించనున్నారు.