
తిరుమలలో భక్తులకు సేవలందించే వివిధ సేవా కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. భక్తులకు సేవలందించడానికి కరోనాకు మందు 176 కౌంటర్లు ఉండేవి. పదేళ్లుగా త్రిలోక్ ఏజెన్సీ తితిదే కౌంటర్లను నడిపింది. సామాజిక ప్రకటనలతో త్రిలోక్ సంస్థ ఆదాయాన్ని సమకూర్చుకునేది. ఏడాదిన్నర ముందు త్రిలోక్ సంస్థ కౌంటర్లు నిర్వహించలేమంది. అందుకే మరో ప్రైవేటు సంస్థకు అప్పగించాం. పాత ఏజెన్సీ కంటే తక్కువ మొత్తలే కొత్త ఏజెన్సీలకి చెల్లిస్తున్నాం. నూతన ఏజెన్సీ ద్వారా రూ. 56 లక్షలు తక్కువగా ఖర్చువుతోంది అని ధర్మారెడ్డి తెలిపారు.