ఇడుపులపాయలో జులై 8న జరిగిన వైఎస్ జయంతి సభలో ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇద్దరు కలుసుకోకుండా వేర్వేరు సమయాల్లో పాల్గొని తమ తండ్రికి నివాళులర్పించారు. అప్పట్లో దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది. అన్నాచెల్లెలు ఇలా భిన్న ధృవాలుగా ఉంటే ఎలా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి. ఇద్దరు అన్నాచెల్లెల్లు కావడంతో వారిలో ఎందుకు అభిప్రాయ భేదాలు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇద్దరు రెండు ప్రాంతాల్లో రాజకీయం చేస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు విద్వేషాలు పెంచుకోవడం అని సముదాయిస్తున్నారు.
ఎప్పుడు చాలా సందడిగా కనిపించే వారి ముఖాల్లో ఈసారి మాత్రం ఆ కళ కనిపించలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వచ్చారు. గతంలో కూడా క్రిస్మస్ వేడుకల్లో కూడా కుటుంబసభ్యులు కలవలేదు. తెలంగాణల షర్మిల పార్టీ ఏర్పాటును జగన్ వ్యతిరేకించారు. తెలంగాణతో ఉన్న సంబంధాలతో దెబ్బతింటామని చెప్పినా షర్మిల వినిపించుకోలేదు. పార్టీ ఏర్పాటుకే మొగ్గు చూపారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. అన్నకు రాఖీ కట్టేందుకు కూడా చెల్లి రాకపోగా ట్విటర్ లో శుభాకాంక్షలు మాత్రమే తెలిపింది.
ఈ నేపథ్యంలో సెప్లెంబర్ 2న వైఎస్ ఆర్ వర్ధంతి రోజున సంస్మరణ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 350 మంది రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. కానీ ఇందులో ఎంతమంది వస్తారో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ వ్యవహారాల్లో విజయమ్మ చురుకైన పాత్ర పోషించేందుకే నిర్ణయించుకున్నారు. కొడుకు జగన్ ను సైతం లెక్క చేయడం లేదు. దీంతో చెల్లెలి కోసం తల్లి తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా తండ్రి వర్ధంతిలో అవి కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందరి ముందు చులకన అవుతామనే ఉద్దేశంతో కలిసి నివాళులర్పించడంతో అందరి దృష్టి వారిపైనే పడింది. ఇన్నాళ్లు కలుసకోకుండా ఉన్నా ఇప్పుడు మాత్రం ఒక్కటిగా పాల్గొనడంతో అందరు ఆసక్తిగా తిలకించారు. ఎవరి సిద్ధాంతాలు వారికున్నా తండ్రికి మాత్రం నివాళి అర్పించడంలో ఎలాంటి బేషజాలకు పోలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఆత్మీయ సమావేశం లోటస్ పాండ్ లో ఏర్పాటు చేశారు. దీనికి చాలా మందిని ఆహ్వానించారు. వైఎస్ ఆర్ హయాంలో వివిధ హోదాల్లో పనిచేసిన వారిని రావాలంటూ పిలిచారు. వారిలో సినీ ప్రముఖుులు కూడా ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో ఏం మాట్లాడతారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. షర్మిల తల్లి విజయమ్మ కూతురు పార్టీ కోసం ఏ చర్యలు తీసుకుంటారో అని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.