
టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఇంటా విషాదం నెలకొంది. అతడి తండ్రి అజయ్ భాయ్ బిపిన్ చంద్ర పటేల్ ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పార్థివ్ పటేల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మా నాన్న అజయ్ భాయ్ బిపిన్ చంద్ర పటేల్ స్వర్గస్తులైనారని తెలియజేసేందుకు చింతిస్తున్నాం. తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాని ప్రార్థించగలరు అని అతడు ట్వీట్ చేశాడు.
గత కొంత కాలం కిందట మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అజయ్ బిపిన్ చంద్ర పటేల్ స్వస్థలం అహ్మదాబాద్. సుదీర్ఘ కెరీర్ తర్వాత తాను అన్ని ఫార్మాట్ ల నుంచి రిటైర్ అవుతున్నట్లు పార్థివ్ పటేల్ గతేడాది ప్రకటించిన సంగతి తెలిసందే. ప్రపంచ క్రికెట్ మొత్తంలో అత్యంత చిన్న వయస్సులోనే వికెట్ కీపర్ గా ఎదిగిన ఆటగాళ్లలో అతడిది తొలి స్థానం. ఇక టీమిండియా తరఫున పార్థివ్ పటేల్ 25 టెస్టుల్లో 934 పరుగులు సాధించాడు. ఇందులో 6 అర్ధ శతకాలు ఉన్నాయి.
వికెట్ కీపర్ గా 62 క్యాచ్ లు పట్టిన అతడు 10 స్టంపింగ్ లు చేశాడు. 38 వన్డేల్లో 736 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, ప్రజ్ఞన్ ఓజా పార్థివ్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అజయ్ భాయ్ బిపిన్ చంద్ర పటేల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా కొంతకాలం మొదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పార్థివ్ తండ్రిని స్వస్థలం అహ్మదాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.