
కరోనా నుంచి దేశం, రాష్ట్రన్ని కాపాడాలని కోరుతూ పరమేష్టి యాగం నిర్వహించినట్లు ప్రముఖ గురువు త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధి ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరంలో ని దివ్యసాకేత క్షేత్రంలో సర్వరోగ నివారణ పరమేష్టి ఆగమ ప్రక్రియ యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆశ్రమ వేదపండితులు, వేద విద్యార్థులు తామర పూలతో హోమం, ఆశీర్వచనాన్ని శాస్రోక్తంగా జరిపారు.