Papam Prathap movie collections : మన టాలీవుడ్ లో గతం లో పెద్ద సినిమాలు విఫలం అయ్యినప్పుడు , చిన్న సినిమాలు థియేటర్స్ ని కాపాడేవి. బయ్యర్స్ , ఎక్సిభిటర్స్ ని నష్టాల్లోని నష్టాల నుండి బయటపడేసేవి. ఈ ఏడాది కూడా ‘రాజా సాబ్ ‘ , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి పెద్ద హీరోల సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచి, బయ్యర్స్ ని కోలుకోలేని చావు దెబ్బ కొట్టాయి. ఇలాంటి సమయం లో ఎప్పటి లాగానే చిన్న సినిమాలు వీళ్ళని ఆదుకుంటాయని అందరూ భావించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. చిన్న సినిమాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి. ఈమధ్య కాలం లో ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న చిన్న సినిమా ‘పాపం ప్రతాప్’. విభిన్నమైన కథాంశాలతో , తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ని ఏర్పాటు చేసుకున్న తిరువీర్ ఇందులో హీరో.
ప్రొమోషన్స్ కూడా మూవీ టీం చాలా గట్టిగా చేశారు, సోషల్ మీడియా లో ఏ యూట్యూబ్ ఛానల్ లో చూసినా వీళ్ళే కనిపించేవారు. ఆ రేంజ్ ప్రొమోషన్స్ చేసినప్పటికీ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి ఓపెనింగ్ కూడా దక్కలేదు. కనీసం 2 వ రోజు నుండి అయినా పుంజుకుంటుంది అని అనుకుంటే అది కూడా జరగలేదు. కారణం ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాకపోవడమే. 3 కోట్ల 50 లక్షల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఈ మూడు రోజుల్లో ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ముందుగా ఓవర్సీస్ విషయానికి వస్తే , మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి కేవలం 25 వేల డాలర్లు మాత్రమే వచ్చింది. ఇక ఇండియా లో మొదటి రోజు ప్రీమియర్ షోస్ తో కలిపి కేవలం 26 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది.
ఇక రెండవ రోజున 26 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకోగా, 3 వ రోజున 28 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకుంది. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల్లో 80 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా కోటి రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. దీంతో ఈ చిత్రానికి కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ని బట్టీ చూస్తే ఈ చిత్రానికి కేవలం మరో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వస్తాయని తెలుస్తోంది. అంటే బయ్యర్స్ కి సాలిడ్ గా 2 కోట్ల 50 లక్షల రూపాయిల నష్టం రాబోతుంది అన్నమాట.