Pakistan T20 World Cup : భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టి20 వరల్డ్ కప్ కోసం దాదాపు అన్ని జట్లు తమ ఆటగాళ్లను ప్రకటించాయి. ఈ టోర్నీలో ఆడబోమని బంగ్లాదేశ్ ప్రకటించింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడుతోంది.
బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత పాకిస్తాన్ కూడా అలానే టోర్నీ నుంచి బయటికి వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు. పాకిస్తాన్ అలా వెళ్ళిపోతోంది అని అనుకోవడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే, కొద్దిరోజుల నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ భుజం భుజం రాసుకుంటూ తిరుగుతున్నాయి. పాకిస్తాన్ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే.. ఈసారి జరిగే టి20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదయ్యేది.
కానీ, పాకిస్తాన్ నిర్ణయం తీసుకోలేదు. ఇక ఇటీవల టీ20 పాకిస్తాన్ ఆట తీరు కూడా అంత గొప్పగా లేదు. విదేశీ లీగ్ లలో ఆ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు టి20 వరల్డ్ కప్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.. బంగ్లాదేశ్ మాదిరిగా కాకుండా.. విభిన్నంగా ఆలోచించింది. టి20 వరల్డ్ కప్ లో ఆడతామని వెల్లడించింది.
పాకిస్తాన్ టి20 వరల్డ్ కప్ కి సంబంధించి జట్టును ప్రకటించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జావేద్, పాకిస్తాన్ టి20 కెప్టెన్ సల్మాన్ అఘా, వైట్ బాల్ హెడ్ కోచ్ ఫర్హాన్, ఉస్మాన్ తారీక్ వంటి వారు పాకిస్తాన్ జట్టును ప్రకటిస్తున్నప్పుడు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత జట్టును ప్రకటించారు.
సల్మాన్ అఘా, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజామ్, షహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, ఖవాజా మహమ్మద్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీబ్ షా, ఫర్హాన్, ఆయూబ్, షాహిన్ ఖాన్ వంటి వారు టి20 వరల్డ్ కప్ లో ఆడబోతున్నారు.
శ్రీలంక, భారత్ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచులు శ్రీలంకలో నిర్వహిస్తారు. పాకిస్తాన్ జట్టులో అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజామ్, ఫకర్ జమాన్, మహమ్మద్ నవాజ్, నసీం షా, సైమ్ ఆయుబ్, షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ వంటి వారు 2021 నుంచి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టి20 టోర్నీలు ఆడుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో 20 జట్లు ఆడుతున్నాయి. ప్రతి జట్టు సూపర్ 8, నాకౌట్ దశకు ముందు నాలుగు గ్రూప్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు పొట్టి సమరం జరుగుతుంది. ఇక ఈ టోర్నీ కంటే ముందు పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో జనవరి 29, 31, ఫిబ్రవరి 1 న జరిగే మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడుతుంది. ఈ టోర్నీ ని పురస్కరించుకొని పాకిస్తాన్ జట్టు సోమవారం నుంచి ప్రాక్టీస్ మొదలు పెడుతుంది.