Maruti Suzuki Wagon R: భారతదేశంలో బడ్జెట్ కార్లను అందించే కంపెనీ అంటే Maruti Suzuki గురించి ఎక్కువగా చెబుతుంటారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు బడ్జెట్ లోనే కార్లను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా Citroen కంపెనీ మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఓ కారును పరిచయం చేసింది. ఇది మారుతి కంపెనీకి చెందిన వ్యాగన్ఆర్ కు గట్టి పోటీ అని అంటుంది. ఆకర్షణ ఏమైనా డిజైన్తోపాటు.. సౌకర్యవంతమైన ఫీచర్లు కలిగి ఉండి బడ్జెట్లోనే వచ్చే ఈ కార్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..
Citroen కంపెనీ నుంచి లేటెస్ట్ గా C3 లైవ్ (0) వేరియంట్ కారును కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇందులో స్టైలిష్ డిజైన్తో పాటు.. సౌకర్యవంతమైన ఫీచర్లు అమర్చి తక్కువ ధరకే అందిస్తున్నారు. ఈ కారులో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ను సెట్ చేశారు. ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేయనుంది. అలాగే పార్కింగ్ కోసం రియర్ వ్యూ కెమెరా, పాక్ లైట్ల పై క్రోమ్ టచ్ వంటివి ప్రీమియం లుక్ ను అందిస్తాయి. సైడ్ బాడీ క్లాడింగ్, వీల్ ఆర్చ్ క్లాడింగ్ వంటివి SUV కారు అనే తలపిస్తాయి.
ఇందులో ఇంజన్ వ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తూ మిడిల్ క్లాస్ పీపుల్స్ కు సేవ్ చేసే విధంగా పనిచేస్తుంది. ఈ కారులో 1.2 లీటర్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇది 80.4 బిహెచ్పి పవర్ తో పాటు 115NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ లీడర్ ఇందడానికి 19.3 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం ఉంది. అలాగే 10 సెకండ్ల లోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఇంజన్ పనితీరు ఉండనుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. సేఫ్టీ లోను ఈ కారులో ప్రత్యేకంగా ఫీచర్లు అమర్చారు. ఇందులో 6 హెయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్టెబిలిటీ ప్రోగ్రాం, ఆంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి లేటెస్ట్ లుక్ ను అందిస్తాయి.
చిన్న ఫ్యామిలీతో పాటు రోజువారి అవసరాలకు అనుగుణంగా ఈ కారు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇప్పటివరకు బడ్జెట్ కారును కొనాలనుకుంటే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ వైపే చూసేవారు. కానీ ఇప్పుడు ఈ కారు తో సమానంగా Citroen C3 లైవ్ (0) ఫీచర్లో ఉండడంతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ కారును రూ.5.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.