Rajamouli vs Sandeep Reddy Vanga: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘వారణాసి’ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. 2027 వ సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమాతో మరో రేంజ్ లో తెరకెక్కించి తన టాలెంట్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది… ఇక మహేష్ బాబు సైతం ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు…
ఇక ఇండియా సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఆయన డైరెక్షన్లో వచ్చే సినిమా కోసం ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో ఆయన ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ క్రేజ్ నైతే మూటగట్టుకుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. దానికి భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాని సైతం శరవేగంగా షూటింగ్ అయితే జరుపుతున్నారు. 2027 మార్చిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామంటూ రిలీజ్ డేట్ ని సైతం సందీప్ రెడ్డివంగ అనౌన్స్ చేశాడు… ఈ సినిమాతో సందీప్ మరోసారి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. సందీప్ ఈ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు…
ఇక ప్రస్తుతం రాజమౌళి – సందీప్ రెడ్డి వంగ మధ్య తీవ్రమైన ఫైట్ జరుగుతుంది. వారణాసి వర్సెస్ స్పిరిట్ సినిమా అంటూ రెండు సినిమాల మధ్య పోటీ ఉంది. ఈ రెండు మూవీస్ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే కావడం వల్ల ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సెక్షన్స్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సందీప్ చేతిలో రాజమౌళి ఓడిపోతాడా? లేదంటే రాజమౌళి కొట్టే దెబ్బకు సందీప్ కోలుకోలేని కంగు తింటాడా అనేది చాలా ఆసక్తిగా మారింది. ఇక వీళ్ళిద్దరు కూడా ఒకే టైంలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు సినిమాలు ఎలాంటి ప్రేక్షకాదరణ పొందుతాయి. రెండు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయా? లేదంటే ఒక సినిమా సక్సెస్ అయ్యి మరో సినిమా డీలా పడే అవకాశాలు ఉన్నాయా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…