
పద్మ అవార్డుల కోసం నామినేషన్లు పంపాలని ప్రధాని మోదీ ప్రజలను ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతాల్లో వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారిని గుర్తించి పద్మ అవార్డులకు సిఫార్సు చేయాలని కోరారు. భారత్ లో ప్రతిభ గలవారు అనేక మంది ఉన్నారు. వారంతా క్షేత్రస్థాయిలో విశేష సేవలందిస్తున్నారు. కానీ వారి గురించి మనం పెద్దగా పట్టించుకోం. అలాంటి వారు మీకు తెలుసా? వారిని మీరు పద్మ అవార్డులకు నామినేట్ చేయెచ్చు. నామినేషన్లు పంపేందుకు సెప్టెంటరు 15వరకు అవకాశం ఉంది అని మోదీ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.