
దేశంలో వ్యాక్సిన్ కు కొరత ఉందన్న వార్తల నేపథ్యంలో కొవిషీల్డ్ ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వార్తలను ఖండించిన కొద్దిసేపటికే ఆయన ట్విటర్ లో వివరణ ఇచ్చారు. సీరమ్ సంస్థ తరఫున వ్యాక్సిన్ల ఉత్పత్తి పై ఓ లేఖను ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో ఏముందో చూద్దాం. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వివరణ ఇస్తున్నాను అని తెలిపారు. రాత్రికి రాత్రి వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడం సాధ్యం కాదు. ఇక ఇండియా చాలా పెద్ద దేశం. అంతమందికి వ్యాక్సిన్లు తయారు చేయండం అంత సులువు కాదు. ధనిక దేశాలు కూడా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపారు.