
చైనాపై తక్కువగా ప్రత్యక్ష విమర్శలు చేసే న్యూజిలాండ్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంది. ఇప్పటి వరకు చైనాను ప్రత్యేక్షంగా ఏనాడు న్యూజిలాండ్ విమర్శించలేదు. జిన్జియాంగ్ లో మానవ హక్కులపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ నేరుగా చైనాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. అయితే, న్యూజిలాండ్ తాజా ప్రకటన చైనా పట్ల వారి మారుతున్న దృక్పథాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. తన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాలో మానవ హక్కుల సమస్యపై ఇప్పుడు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో న్యూజిలాండ్ కలిసి వస్తున్నట్లు కనిపిస్తున్నది.