
ఐపీఎల్ లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లకు కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఐపీఎల్ ను భయపెడుతోంది. ఐపీఎల్ బయో బబుల్ లో ఉన్న పలువురు ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. మే 30వ తేదీన టోర్నీ ముగిసిన తర్వాత తమను స్వదేశం తీసుకెళ్లాడానికి చార్టర్డ్ ఫ్లయిట్ లను ఏర్పాటు చేయాలని ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిద్యం వహిస్తున్న ఆసీస్ క్రికెటర్ క్రిస్ లిన్ ఇటీవల క్రెకెట్ ఆస్ట్రేలియా అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ముగిసిన ముగిసిన తర్వాత భారత్ నుంచి తమ ఆటగాళ్లను స్వదేశానికి తీసుకురావడానికి ప్రస్తుత పరిస్థితుల్లో చార్టర్డ్ ఫ్లయిట్ ను ఏర్పాటు చేసే ఆలోచన క్రికెట్ ఆస్ట్రేలియాకు లేదని చీఫ్ నిక్ హాక్లే సోమవారం తెలిపారు.