Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ దాడిలో పాక్ కిరానా హిల్స్ లో ఉన్న న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ధ్వంసమైనట్లు రక్షణమంత్రి సలహాదారు ఖాందారె రిపబ్లిక్ టీవీ తో చెప్పారు. అయితే దాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయలేదని స్పష్టం చేశాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కిరానా హిల్స్ పై దాడి చేసినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆర్మీ అప్పట్లో వాటిని ఖండించింది. కానీ ఇప్పుడు ఖాందారె కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.