IPL Final 2025: ఈరోజు rcb vs pbks మధ్య ఐపీఎల్ ఫైనల్ జరిగే అహ్మదాబాద్ మోదీ స్టేడియం వద్ద వర్షం మొదలైంది. ఇప్పుడిప్పుడే స్టేడియంలోకి ఫాన్స్ అడుగుపెడుతున్నారు. వర్షం కురుస్తుండటంతో ఫ్యాన్ ఆందోళన చెందుతున్నారు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండడంతో అప్పటిలోగా వర్షం తగ్గే ఛాన్సుంది. కాగా ఇవాళ వర్షం పడి మ్యాచ్ జరగకపోతే రేపు రిజర్వ్ డే ఉంది. అప్పుడు మ్యాచ్ సాధ్యం కాకపోతే లీగ్ స్టేజీలో టాప్ లో నిలిచిన పంజాబ్ టైటిల్ విన్ అవుతుంది.