
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ నిర్వహిస్తోన్న సమీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పంటల సాగు, ఎరువులు, విత్తనాల లభ్యతపై సీఎం సమీక్షించనున్నారు. వానాకాలం రైతుబంధు నిధులపైనా చర్చించే అవకాశం ఉంది.