Pawan Kalyan OG Universe : పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ అనే పేరు తీస్తే ఏ రేంజ్ లో పూనకాలు వస్తాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా వచ్చి 8 నెలలు దాటింది , పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎన్నో విజయాలు సాధించాడు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా పొందాడు. వాటికి కూడా రానటువంటి ఉత్సాహం, అభిమానులకు ఓజీ పేరు తీస్తే వస్తోంది. అభిమానులతో అలాంటి ఎమోషనల్ బాండింగ్ ని ఏర్పాటు చేసుకుంది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ అయిపోయాడు, అసలు ‘ఓజీ 2’ ఉంటుందా లేదా అనే సందేహం ప్రతీ ఒక్కరిలోనూ ఉండేది. కానీ అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా ‘ఓజీ 2’ చేయబోతున్నాను అని ఒక ప్రకటన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుండి రావడంతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇక సుజిత్ విదేశాల నుండి తిరిగి రీసెంట్ గానే రావడం , నేడు ఆయన మంగళగిరి లో పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటో ని కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుండి పోస్ట్ చేయగా, అది సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ఎంతో స్టైలిష్ గా హుడీ వేసుకొని స్టోరీ చర్చల్లో పాల్గొనడం , సుజిత్ ఎంతో ఉత్సాహం తో స్టోరీ ని వివరిస్తున్నట్టు ఫోజులు ఇవ్వడం , వెనుక ‘OG universe’ పేరుతో ఒక పెద్ద పోస్టర్ కనిపించడం , అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా ఇంత ఫాస్ట్ గా ఉన్నదేంటి. ఈ సినిమా పట్ల అభిమానులు ఎంత ఉత్సాహంతో ఉన్నారో , పవన్ కళ్యాణ్ కూడా అంతే ఉత్సాహం తో ఉన్నాడని ఆయన స్పీడ్ ని చూస్తేనే అర్థం అవుతోంది, ఇది కదా మేము పవర్ స్టార్ నుండి కోరుకున్నది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 2 న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఒక కాన్సెప్ట్ వీడియో తో ప్రకటన చేయబోతున్నారని టాక్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయట. నవంబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతుంది అట. ఎక్కువ శాతం జపాన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట. అయితే DVV దానయ్య నిర్మాతగా ఈసారి కొనసాగే పరిస్థితులు లేవని నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా లో చర్చలు జరిగాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదట, కాకపోతే DVV తో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ కూడా నిర్మాణం లో భాగం కాబోతుంది. వచ్చే ఏడాది దసరా కి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
As promised by @PawanKalyan , #OGUniverse discussions have begun with @Sujeethsign at Creative Works! @MusicThaman#OG2 pic.twitter.com/6l7UzJUpvh
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 21, 2026
