
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ లో అత్యాచారానికి గురైన బాధితురాలు గుర్తింపును వెల్లడించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, తదితరులు బాధితురాలి గుర్తింపును వెల్లడించినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. అత్యాచారానికి గురైన మహిళలు, బాలల పేర్లు, ఇతర వివరాలను వెల్లడించడం నేరం. బాధితురాలిపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయంపై స్వీయ విచారణ జరుపుతున్నామని దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.