
ప్రగతి భవన్ ను నర్సులు ముట్టడించారు. ఏడాదిన్నర కాలంగా కోవిడ్ సేవలు చేయించుకుని అర్ధాంతరంగా తొలగించారని వారు నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1640 మంది నర్సులను తొలగించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నర్సులంతా కలిసి పై అధికారులను సంప్రదించగా తమకు సంబంధంలేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని వారు చెప్పడంతో ఇవాళ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.