Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu marriage story : ఎన్టీఆర్ పెళ్లి ప్రతిపాదనను చంద్రబాబు పట్టించుకోలేదా

Chandrababu Naidu marriage story : ఎన్టీఆర్ పెళ్లి ప్రతిపాదనను చంద్రబాబు పట్టించుకోలేదా

Chandrababu Naidu marriage story  : ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా ఉన్న చంద్రబాబు 1978లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీతో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టే సమయానికి వయస్సు 28 సంవత్సరాలు మాత్రమే. 30 సంవత్సరాలకే ఆయన మంత్రిగా కూడా అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండగానే ఎన్టీఆర్ కుమార్తెను వివాహం ఆడారు. వీరి వివాహం జరిగిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే నారా భువనేశ్వరి తో చంద్రబాబు వివాహం ప్రతిపాదన చేసింది తొలుత ఎన్టీఆర్. ఆయన వర్తమానం పంపిన తర్వాత పెద్దవారితో మాట్లాడి చంద్రబాబు భువనేశ్వరిని వివాహం ఆడారు.

* అప్పట్లో ఇద్దరు ప్రముఖులే..
తెలుగు చిత్ర పరిశ్రమలో( Telugu cinema industry) అగ్ర నటుడుగా నందమూరి తారకరామారావు కొనసాగుతున్నారు. 1978లో ఎమ్మెల్యే అయిన చంద్రబాబు టి. అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండేవారు. సినీ పరిశ్రమ పెద్దలతో ఉన్న పరిచయాలు కారణంగా ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు చంద్రబాబు. వెంటనే తన కుమార్తె భువనేశ్వరి తో వివాహ ప్రతిపాదనను చంద్రబాబుకు ఎన్టీఆర్ పంపించారట. అయితే పెద్దవారితో మాట్లాడి కబురు పంపుతామని చంద్రబాబు చెప్పారట. భువనేశ్వరిని పెళ్లాడాలని ఎన్టీఆర్ కోరారని.. మొదట్లో తాను కొంచెం బెట్టు చేశానని చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే అప్పట్లో పెళ్లి చూపులకు వెళ్ళగానే పెద్ద పూలమాల తీసుకొచ్చి చంద్రబాబు మెడలో వేశారట. అలా అప్పట్లో వివాహ తంతు పూర్తయింది.

* కట్నం ప్రసక్తిలే..
అప్పట్లో చంద్రబాబుకు ఎన్టీఆర్( NTR) ఎటువంటి కట్నం ఇవ్వలేదని ఒక ప్రచారం ఉంది. చంద్రబాబు సైతం పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పారు. కట్నం కింద డబ్బులు ఇవ్వద్దని.. పెళ్లి మాత్రం ఘనంగా జరపాలని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. అప్పట్లో చిత్తూరు జిల్లాలోని ప్రతి ఇంటికి శుభలేఖ పంపించారట. అప్పటికే ఎన్టీఆర్ స్టార్ హీరో. చంద్రబాబు యువ మంత్రి. నాటి పెళ్లికి రాజకీయ సినీ ప్రముఖులు అధికంగా వచ్చారు. ఈరోజు చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఎక్కువగా ఆయన జీవితం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.. అప్పట్లో చంద్రబాబు వివాహం, వివాహ ఆహ్వాన పత్రిక గురించి ఎక్కువగా వార్తలు హైలైట్ గా నిలుస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular