
ఢిల్లీలోని ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్ ను అప్పగించేది లేదని ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. దక్షిఫ దీనాజ్ పూర్ లో జరిగిన టీఎంసీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ తాను క్రీడాకారిణిని కాదని అయితే ఆడటం ఎలాగో తనకు తెలుసునని చెప్పారు. లోక్ సభలో అంతకుముందు తాను ఉత్తమ క్రీడాకారిణినని తెలిపారు. ఇద్దరు ఢిల్లీ గూండాలకు బెంగాల్ ను అప్పగించబోమన్నారు. ఆమె పరోక్షంగా బీజేపీ అధిష్ఠానాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. శాసన సభ ఎన్నికల్లో ఆరో దశలో నాలుగు జిల్లాల్లోని 43 నియోజకవర్గాలకు పోలింగ్ గురువారం జరుగుతోంది తాజా సమాచారం ప్రకారం 57. 30 శాతం పోలింగ్ నమోదైంది.