
జమ్ముాకాశ్మీర్ రాష్ట్రంలోని ఆచార్య శ్రీ చందర్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా కొరత కారణంగా ఏ రోగి మరణించలేదని ప్రభుత్వం పేర్కొంది. కరోనా పాజిటివ్ మహిళా కుటుంబ సభ్యులు ఆక్సిజన్ లభించకపోవడం వల్ల అస్కామ్ ఆసుపత్రిలో మరణించారని పేర్కొన్న తరువాత ఈ ప్రకటన వచ్చింది. మరో వైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.