
అమూల్ తో కుదిరిన ఎంవోయూపై ఈనెల 14 వరకు ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అమూల్ తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని సవాల్ చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ లోని అమూల్ సంస్థతో పాటు నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్టుకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఒప్పందరం పూర్తి వివరాలు ఇవ్వాలని అమూల్, డెయిరీ బోర్డును కోర్టు ఆదేశించింది. కేసు విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.