
సంచలనం సృష్టించిన ముంబై పార్న్ రాకెట్ లో శిల్పాశెట్టి పాత్రపై పోలీసులకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. శిల్పశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ఈ కేసులో జూలై 19న ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పార్న్ రాకెట్ లో శిల్పశెట్టికి ప్రమేయం ఉందనే ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తో పాటు ఆర్థిక ఆధారాలు కానీ పత్రాలు కానీ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు.