
భారత్ లో రెండో దశలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. తాతాజా మాల్దీవులు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా దక్షిణ ఆసియా నుంచి వచ్చే పర్యాటకుల వీసాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని అన్ని రకాల వీసాలకు వర్తిస్తుందని చెప్పింది. గత 14 రోజుల్లో దక్షిణ ఆసియా దేశాల్లో పర్యటించిన ఇతర దేశాల పర్యటకులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.