
రెమ్యూనరేషన్ పెంపు విషయంపై బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ స్పందించింది. రెమ్యూనరేషన్ పెంచడం అనేది డిమాండ్ కాదని, మహిళల గౌరవం అని తెలిపింది. రామాయణ పేరుతో తెరకెక్కనున్న చిత్రంలో ఓ పాత్ర కోసం కరీనా రూ. 12 కోట్లు డిమాండ్ చేసిందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపైనే కరీనా తాజాగా స్పందించింది. కరీనా కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న రామాయణ చిత్రాన్ని అలౌకిక్ దేశాయ్ డైరెక్ట్ చేస్తున్నాడు.