Karthika Deepam Serial: తెలుగులో కార్తీక దీపం సీరియల్ కు ఉన్న రేటింగ్ మరే ఇతర సీరియల్స్ కు లేవు. అంతాల పాపులారిటీ తెచ్చుకుంది ఈ కార్తీకదీపం సీరియల్. అయితే కార్తీకదీపం సీరియల్ ఇక అయిపోతుందన్న క్రమంలో డైరెక్టర్ సాగదీస్తూ వచ్చాడు. ప్రేక్షకుల కోరిక మేరకే ఇలా పొడిగించుకుంటూ వెళ్తున్నట్లు ఓ సందర్భంలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ సీరియల్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వస్తున్న ఎపిసోడ్ చూస్తే.. కథ చివరకు వచ్చినట్లే కనిపిస్తోంది.
కోర్డులో జరగుతున్న సీన్ లో కార్తీక్ గురించి రోషిణి విరుద్దంగా మాట్లాడుతుంది.. తర్వాత వాదనలు ముగిశాయని జడ్జి క్లోజ్ చేస్తున్న తరుణంలో దీప ఎంట్రీ ఇస్తుంది. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదు అంటూ వాదిస్తుంది. దీనికి సాక్ష్యంగా మోనిత బతికే ఉందంటూ.. జడ్జి ముందు ప్రవేశపెడుతుంది దీప. దీంతో అక్కడ ఉన్నవారు షాక్ అవుతారు. రోషిణి మాత్రం మోనితను చూసి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతుంది. మోనిత కూడా నిజం ఒప్పుకుంటూ.. కార్తిక్ తప్పు చేయలేదు.. తాను ప్రెగ్నెంట్ అయినట్లు నాటకం ఆడాను అంటూ చెబుతుంది.
ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశావ్.. అంత అవసరం ఏంటి అంటూ జడ్జి మోనతను అడగ్గా.. కార్తీక్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. తను నాకే దక్కాలనే కారణంతో ఇలా చేశాను అంటూ చెబుతుంది మోనిత. దీంతో జడ్జి కూడ కాస్త అసహనం వ్యక్తం చేస్తాడు. సాక్ష్యాలు బలంగా ఉన్న తర్వాతనే ఏ వ్యక్తినైనా విచారించాలి.. కానీ ఎలాంటి ఆధారం.. సాక్ష్యం లేకుండా వైద్య వృత్తిలో ఉన్న కార్తీక్ ను ఇలా విచారించి అవమానపరచడం సరైంది కాదంటూ రోషిణిపై జడ్డి కోపం తెచ్చుకుంటాడు.
తర్వాత జడ్జి తుది తీర్పును వెల్లస్తాడు. కార్తీక్ ఏ తప్పు చేయలేదని ఈ కోర్డు నమ్ముతుందంటూ.. చెప్పడంతో నిర్దోషిగా కార్తీక్ బయటకు వస్తాడు. మోనితను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారణ చేయాలంటూ తీర్పు ఇస్తాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. వాళ్లు సంతోషంగా ఉన్న సమయంలో మోనిత దగ్గరకు వచ్చి.. ఇంకా శుభం కార్డు పడలేదు.. అసలైంది ఇంకా ముందు ఉంది అంటూ బాంబు పేల్చుతుంది. రేపటి ఎపిసోడ్ లో మరో ప్లాన్ గురించి మోనిత రత్నసీమతో మాట్లాడుతుండటం కనిపిస్తుంది.