
రాంకీ గ్రూప్ షేర్లకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖండించారు. సంస్థలో తన పేరిట ఉన్న 12 వేల షేర్లను ఎవరికీ విక్రయించలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు సరి చూసుకోవాలన్నారు. ఏనాడు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని, పాల్పడబోనని ఆయన స్పష్టం చేశారు.