Telugu News » Ap » No cooperation from the government anandayya
ప్రభుత్వం నుంచి సహకారం లేదు.. ఆనందయ్య
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఔషధం పంపిణీ కొనసాగుతుందని ఆనందయ్య తెలిపారు. ఇవాళ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే అందిస్తామని స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆయన సూచించారు. కొన్ని ఆటంకాల వల్ల ఔషధ పంపిణీ సవ్యంగా సాగట్లేదన్నారు. పంపిణీకి వనరులు సమాకూరడం లేదని విద్యుత్ సౌకర్యం, ఔషధ తయారీ యంత్ర సామగ్రి లేదని చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప ఇప్పటి వరకు సహకారం లేదని ఆనందయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధాన్ని అందిస్తామన్నారు.