Homeక్రైమ్‌Nizamabad Crime : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్త ఒంట్లోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించింది

Nizamabad Crime : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్త ఒంట్లోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించింది

Nizamabad Crime : పోలీసుల కేసులు పెడుతున్నారు.. న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధిస్తున్నాయి.. సమాజం దూరం పెడుతున్నది.. అయినవాళ్లు దగ్గరికి కూడా రావడం లేదు. అయినప్పటికీ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పైగా కొత్త కొత్త పద్ధతుల్లో ఈ దుర్మార్గాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ప్రాణాలు పోతున్నాయి. ఈ వ్యవహారాలలో ఎక్కువగా మగవాళ్ళప్రాణాలు గాలిలో కలిసిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలలో చిచ్చులు పెడుతున్నాయి. అంతేకాదు ప్రాణాలు కూడా తీస్తున్నాయి. గతంలో ఇటువంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చినప్పుడు పెద్దలు పంచాయతీలు పెట్టేవారు. ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించేవారు. తద్వారా ఈ వ్యవహారాలు ఆదిలోనే ముగిసిపోయేవి. ఇప్పుడు పెద్ద కుటుంబాలు లేవు. పెద్దలు చెప్పిన మాటలు వినే పరిస్థితి లేదు. అందువల్లే మనుషులు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు. చివరికి మృగాల కంటే హీనంగా మారిపోతున్నారు. వివేచన కోల్పోయి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటువంటిదే ఈ సంఘటన కూడా. కాకపోతే ఈ నేరం జరిగిన తీరు సభ్య సమాజం తరలించుకునే విధంగా ఉంది. అసలు ఒక ఆడది ఇలా కూడా చేస్తుందా అనే విధంగా ఉంది..

నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలంలో న్యాల్కల్ అనే గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తన వివాహేత్ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను భార్య అత్యంత దారుణంగా అంతం చేసింది. ఈ గ్రామానికి చెందిన ప్రశాంత్, సంధ్య భార్యాభర్తలు. కొంతకాలంగా ఈమె వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం ప్రశాంత్ కి తెలుసు.. అనేక సందర్భాలలో ఆమెను పట్టుకున్నాడు. నిలదీశాడు. పెద్దలు పంచాయతీలు కూడా పెట్టారు. అయినప్పటికీ సంధ్య ప్రవర్తన మారలేదు. మరింత విచక్షణ రహితంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఎ నేపథ్యంలో గత నెల 30న డాబా మీద పడుకున్న తన భర్తను అక్కడ నుంచి తోసి వేసింది. అయితే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు ఆసుపత్రికి చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న భర్తను ఎలాగైనా చంపాలని సంధ్య భావించింది.. ఈ క్రమంలో టాయిలెట్ క్లీనర్ ను భర్త శరీరంలోకి ఎక్కించింది. అతని పరిస్థితి విషమంగా మారి చనిపోయాడు.. అయితే ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో వారు సంధ్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular