
కరోనా అడ్డుకట్ట వేసేందుకు పెళ్లిళ్లు ఇతర సామాజిక కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు సర్కారు చురుకైన చర్యలు చేపడుతున్నదని ఆయన అన్నారు. మే 5 నుంచి 15 వ తేదీ వరకు లాక్ డౌన్ విధించాలని తన ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా అందరూ కరోనా పోరులో భాగస్వాములు కావాలని పిలును ఇచ్చారు.