Telugu News » National » Nitish kumar interesting comments on population control
జనాభా నియంత్రణపై నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనాభా నియంత్రణకు యూపీ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన ముసాయిదాపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం చట్టాలు చేయడం ద్వారా మాత్రమే జనాభా నియంత్రణ లక్ష్యాన్ని సాధించలేమన్నారు. చట్టాలు చేసినంత మాత్రాన జనాభా నియంత్రణ సాధ్యం కాదనేది తన స్పష్టమైన అభిప్రాయమని తెలిపారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై ప్రతి రాష్ట్రానికి స్వతంత్రత ఉంటుందన్నారు. అయితే, మహిళలు చదువుకున్నప్పుడే వారిలో తగిన చైతన్యం వస్తుందని, తద్వారా సంతానోత్పత్తి రేటు తగ్గేందుకు అవకాశం […]
జనాభా నియంత్రణకు యూపీ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన ముసాయిదాపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం చట్టాలు చేయడం ద్వారా మాత్రమే జనాభా నియంత్రణ లక్ష్యాన్ని సాధించలేమన్నారు. చట్టాలు చేసినంత మాత్రాన జనాభా నియంత్రణ సాధ్యం కాదనేది తన స్పష్టమైన అభిప్రాయమని తెలిపారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై ప్రతి రాష్ట్రానికి స్వతంత్రత ఉంటుందన్నారు. అయితే, మహిళలు చదువుకున్నప్పుడే వారిలో తగిన చైతన్యం వస్తుందని, తద్వారా సంతానోత్పత్తి రేటు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.