Homeఆంధ్రప్రదేశ్‌Perni Nani : నా బిడ్డ చనిపోవడానికి కారణం పేర్ని నాని నే అంటూ నిరంజన్...

Perni Nani : నా బిడ్డ చనిపోవడానికి కారణం పేర్ని నాని నే అంటూ నిరంజన్ తండ్రి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Perni Nani : ఇటీవలే పవన్ కళ్యాణ్ వరంగల్ కి చెందిన నిరంజన్ అనే వీరాభిమాని , జెన్యు సంబంధిత ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండడం తో, అతని కోరిక ని నెరవేర్చేందుకు అతని ఇంటికి వెళ్లి ఆ చిన్నారితో పవన్ ఆప్యాయంగా పలకరించిన ఘటన యావత్తు తెలుగు ప్రజల హృదయాలను హత్తుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజులకే నిరంజన్ చనిపోవడం బాధాకరం. సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరంజన్ కి పెద్ద ఎత్తున్న నివాళి అర్పిస్తూ పోస్టులు పెట్టారు. జనసేన పార్టీ నాయకులు నిరంజన్ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే వైసీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ నిరంజన్ ని కలవడం పైన కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

వైసీపీ పార్టీ కి చెందిన ప్రముఖ నాయకుడు , మాజీ మంత్రి పేర్ని నాని ఈ విషయం పై మాట్లాడుతూ ‘అక్కడెక్కడో తెలంగాణ లో ఎవరో అన్నా నాకు ఒంట్లో బాగాలేదని అన్నాడట, తమ్ముడూ అంటూ ఈయన వెళ్ళిపోయాడు’ అంటూ సెటైర్లు వేశాడు పేర్ని నాని. చావు బ్రతుకుల మధ్య ఉన్న ఒక చిన్నారి గురించి ఈ స్థాయిలో దిగజారి మాట్లాడడం పేర్ని నాని కే చెందిది. వైసీపీ పార్టీ నాయకులు పవర్ లో ఉన్నప్పుడు మనుషులు లాగా ప్రవర్తించలేదు, పవర్ పోయాక ఇంకా దారుణంగా తయారయ్యారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పేర్ని నాని మాట్లాడిన ఈ మాటలపై నిరంజన్ తండ్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రీసెంట్ గానే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వగా, రిపోర్టర్ ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు చాలా ఘాటుగానే ఆయన స్పందించారు.

ఆయన మాట్లాడుతూ ‘పేర్ని నాని ఆరోజు మాట్లాడిన మాటలను మావాడు 200 సార్లు చూసి చాలా బాధపడ్డాడు. మా బాబు ఈరోజు చనిపోవడానికి కారణం కూడా పేర్ని నాని నే, అది నేను బల్లగుద్ది చెప్పగలను. పవన్ కళ్యాణ్ వచ్చినందుకు ఎంత ఆనందపడ్డాడో , ఇతని మాటలు విని అంతకంటే ఎక్కువ బాధపడ్డాడు. నన్ను అన్నా పర్వాలేదు కానీ , నా దేవుడిని అన్నాడు , అసలు తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. ఆ వాయిస్ ని కూడా నేను రికార్డు చేసాను , ప్రస్తుతం అది నా దగ్గర లేదు. రెండు రోజులు ఆ మాటలు విని బాగా కుమిలిపోయాడు , అన్నం కూడా తినలేదు, నిరంజన్ కి మొబైల్ ఉంది , అందులో కూడా చూశాడు. పేర్ని నాని కి బుద్ధి అంటూ ఒకటి ఉండాలి. అతనికి కూడా పిల్లలు , మనవళ్లు ఉన్నారు. అతను ఎలా రాజకీయ నాయకుడు అయ్యాడో నాకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాజకీయం చేయడం కోసం రాలేదు కదా సార్, మీరు గమనిస్తే దారిపొడుగునా ఒక్క బ్యానర్ కూడా లేదు , ఆయనతో పాటు వచ్చినవాళ్లు ఒక్కరు కూడా మెడలో జనసేన కండువా కప్పుకోలేదు. మానవత్వం తో వచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చారు నిరంజన్ తండ్రి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular