
తెలంగాణలో కొనసాగుతున్న రాత్రి కర్ఫ్యూ శనివారంతో పూర్తి కానుండడంతో ప్రబుత్వం మళ్లీ వారం రోజులపాటు పొడిగించింది. కర్ఫ్యూ ఈనెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్ఫ్యూ సందర్భంగా రాత్రి 8 గంటలకు వ్యాపార సముదాయాలు , హోటళ్లు, ఇతర సంస్థలు మూసివేయాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, కమిషనర్స, సూపరింటెండ్ ఆఫ్ పోలీసులకు అధికారాలను కట్టబెట్టారు.