
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,57,229 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా 3,449 మంది చనిపోయారు. 24 గంటల్లో 3,20,289 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 2,02,82,833 కి చేరగా కోలుకున్న వారి సంఖ్య 1,66,13,292 గా ఉంది. అలాగే ప్రస్తుతం 34,47,133 యాక్టీవ్ కేసులు ఉన్నాయి దేశ వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,22,408గా ఉంది, ఇప్పటి వరకు 15,89,32,921 మంది కోవిడ్ టీకా తీసుకున్నాట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.