Test20 : క్రికెట్ మన దేశాన్ని మాత్రమే కాదు.. యావత్తు ప్రపంచాన్ని మొత్తం ఊపేస్తోంది. ముఖ్యంగా టి20 ఫార్మేట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రికెట్ అనేది ప్రపంచ దేశాలకు సుపరిచితమైపోయింది. అమెరికా నుంచి మొదలు పెడితే ఆఫ్ఘనిస్తాన్ వరకు క్రికెట్ ఆడుతున్నాయి. ఐసీసీ క్రికెట్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత ఏడాది ఐసీసీ వెస్టిండీస్ తో పాటు అమెరికా వేదికగా టీ 20 వరల్డ్ కప్ నిర్వహించింది.. ఆ టోర్నీలో అమెరికా కూడా పోటీ పడింది. చివరికి పాకిస్తాన్ లాంటి జట్టును ఓడించి అమెరికా సంచలనం సృష్టించింది.
మిగతా ఫార్మాట్ లతో పోల్చి చూస్తే టి20 ఫార్మాట్ క్రికెట్ అభివృద్ధికి విశేషంగా సహకరిస్తోంది. పైగా ఈ కాలపు యువత టి20 విధానంలో క్రికెట్ ఎక్కువగా ఆడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందువల్లే ప్రపంచ దేశాలలో టీ20 క్రికెట్ లీగులు కొనసాగుతున్నాయి. వీటిలో ఐపీఎల్ అన్నిటికంటే పై స్థాయిలో ఉంది. ఓ నివేదిక ప్రకారం బీసీ సీఐ నిర్వహించే ఐపిఎల్ మార్కెట్ విలువ వేల కోట్లకు చేరుకుంది.
టి20 విధానంతో సరికొత్త ప్రయోగాలు క్రికెట్ల మొదలైతే.. ఇప్పుడు దానికి కొనసాగింపు రాబోతోంది. అయితే టెస్ట్ ఫార్మాట్ లో అందుబాటులోకి రానుంది. టెస్ట్, టీ 20 కలయికతో “టెస్ట్ 20” ఫార్మాట్ ను రూపొందించారు. ఇందులో రెండు జట్లు 20 ఓవర్ల చొప్పున ఒకేరోజు రెండు ఇన్నింగ్స్ లు ఆడతాయి. టెస్ట్ మ్యాచ్ లా రెండు జట్లు రెండు సార్లు బ్యాటింగ్ చేయవచ్చు. 2026 జనవరిలో జూనియర్ టెస్ట్ 20 ఛాంపియన్ షిప్ తొలి సీజన్ నిర్వహిస్తారు. ఈ ఫార్మాట్ ఐసీసీ నిర్వహించడం లేదు. దీనిని గౌరవ్ బహిర్వాణి అనే వ్యక్తి తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ప్లేయర్లు డివిలియర్స్, లాయిడ్, హెడెన్, హర్భజన్ సింగ్ ఈ ఫార్మాట్ కు సలహాదారులుగా ఉండడం విశేషం.
ఐసీసీ దీనిని నిర్వహించకపోవచ్చు అని తెలుస్తోంది. ఒకవేళ ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తే అప్పుడు టెస్ట్ ఫార్ ఫార్మాట్ దెబ్బతింటుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే t20 విధానం వల్ల క్రికెట్ స్వరూప మారిపోయిందని.. అలాంటప్పుడు టెస్ట్ ట్వంటీ అందుబాటులోకి తీసుకొస్తే ఐదు రోజుల సిరీస్ లు జరిగే అవకాశం ఉండదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ విధానం భవిష్యత్తు కాలంలో క్రికెట్ ఒక చిత్రాన్ని పూర్తిగా మార్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.