Bihar Elections Biryani: బిర్యానీ.. ఈ పేరు చెబితే చాలామంది నోట్లో నుంచి లాలాజలం గంగానది లాగా ప్రవహిస్తూ వస్తుంది. ఎందుకంటే బిర్యానీ అంటే వారికి ఆ స్థాయిలో ఇష్టం ఉంటుంది. బిర్యానీ అనేది ఒకప్పుడు ఒక వర్గం వారికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ కాలం గడుస్తున్న కొద్ది బిర్యానీ అనేది అందరికీ ఇష్టమైన వంటకం గా మారిపోయింది.. పైగా హోటళ్లు విపరీతంగా ఏర్పాటు కావడంతో బిర్యానీ అందరికీ అందుబాటులో ఉండడం మొదలైంది.. ఇక ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బిర్యాని క్షణంలోనే కళ్ళ ముందుకు వచ్చేస్తోంది. చూస్తుండగానే కంచంలో తిండిగా మారిపోతుంది.
మనదేశంలో అన్ని రాష్ట్రాలు ఒక విధంగా ఉంటే.. బీహార్ రాష్ట్రంలో పరిస్థితి మరో విధంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు చాలామంది ఉంటారు. ఉన్న ఊరిలో ఉపాధి లేక వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతుంటారు. ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చాలామంది సొంత రాష్ట్రానికి వస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో ఆయా పార్టీల తరఫున పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నవారికి అభ్యర్థులు విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. అలా ఓ అభ్యర్థి ఏర్పాటుచేసిన బిర్యాని విందు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అంతేకాదు అతడు ఏర్పాటుచేసిన బిర్యాని పొట్లాల కోసం పెద్ద యుద్ధమే జరిగింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహదూర్గంజ్ నియోజకవర్గం లో ఎంఐఎం తరఫునుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వచ్చిన కార్యకర్తలకు బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. దీంతో వచ్చిన కార్యకర్తలు ఎలాగైనా సరే బిర్యాని తినాలని దూసుకొచ్చారు. బిర్యానీ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. కొందరైతే భారీగా ప్యాకెట్లను తీసుకొని వెళ్ళిపోవారు. ఇంకొందరేమో బిర్యాని ప్యాకెట్ల కోసం యుద్ధమే చేశారు. వాస్తవానికి నామినేషన్ ముగిసిన తర్వాత ఆయన ఈ కార్యక్రమం గుట్టుగా చేపడితే బాగుండేది. అలా కాకుండా అతడు ఓపెన్ గా బిర్యానీ ప్యాకెట్లను అందుబాటులో ఉంచడంతో ఒక్క సారిగా కల కలం ఏర్పడింది.
బిర్యానీ ప్యాకెట్ల కోసం కార్యకర్తలు చేసిన యుద్ధం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి బీహార్ రాష్ట్ర గతిని మార్చాలని ఈసారి అన్ని పార్టీలు గట్టి సంకల్పంతో ఉంటే.. ఓటర్లు మాత్రం ఇలా బిర్యాని ప్యాకెట్ల కోసం యుద్ధాలు చేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. బీరు, బిర్యానీ ప్యాకెట్ల కోసం ప్రజలు ఈ స్థాయిలో పోరాటాలు చేస్తుంటే.. అభివృద్ధి, సంక్షేమం అనే మాటలను రాజకీయ నాయకులు మర్చిపోవాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
#WATCH | In Bihar’s Kishanganj, Tausif Alam, candidate of Asaduddin Owaisi’s party AIMIM, hosted a biryani feast for supporters ahead of filing his nomination.
Supporters turned up in large numbers – and soon, videos of a “biryani rush” went viral on social media. pic.twitter.com/psI1cIxHiA
— NDTV (@ndtv) October 16, 2025