
సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. న్యాయస్థానం చరిత్రలో తొలిసారి జడ్జీల ప్రయాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. ఇప్పటి వరకు రాష్ట్రపతి భవన్ లో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రయాణ స్వీకారం మాత్రమే ప్రత్యక్ష ప్రసారమయ్యేది. ఇప్పుడు తొలిసారి న్యాయమూర్తుల బాధ్యతల స్వీకారం కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అంతేకాక, ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేయడం కూడా ఇదే మొదటిసారి.