
నూతన విద్యా విధానం వల్ల దేశ గతి మారుతుంది ప్రధాని మోదీ అన్నారు. నూతన విద్యావిధానం వల్ల యువతకు విద్యాఅవకాశాలు పెరుతాయని పేర్కొన్నారు. నూతన విద్యా విధానంలో సాంకేతికతను కూడా జోడించామని, సంకేత భాషకు బోధన భాష హోదా ను కల్పించామని తెలిపారు. ఇకపై ఇంజనీరింగ్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీతో పాటు ఇతర భాషల్లోనూ బోధించే వీలుంటుందని తెలిపారు. ఇంజనీరింగ్ లాంటి ఉన్నత విద్యను ప్రాంతీయ భాషల్లో అందించడం వల్ల గ్రామీణులు, ఆంగ్లంపై పట్టులేని వారు కూడా విద్యను అందిపుచ్చుకోవచ్చని అన్నారు.