Bigg Boss Telugu 9 House Sets Dismantling : ఇప్పటి వరకు జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఆదరించిన బిగ్ బాస్ సీజన్ ఏదైనా ఉందా అంటే , అది సీజన్ 9(Bigg Boss 9 Telugu) మాత్రమే. యూత్ ఆడియన్స్ కి ఏంటి ఈ సోది సీరియల్ డ్రామా అని అనిపించొచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఈ సీజన్ ఒక మర్చిపోలేని జ్ఞాపకం. భరణి, తనూజ , ఇమ్మానుయేల్, సంజన, డిమోన్ పవన్ వంటి కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. సీజన్ మొత్తం వీళ్ళ చుట్టూనే తిరిగింది. విన్నర్ ఎవరైనా అయ్యుండొచ్చు కానీ, ఆ 5 మంది కంటెస్టెంట్స్ మాత్రం ఆడియన్స్ మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. నిన్న బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది అని నాగార్జున చెప్పిన వెంటనే, అయ్యో, అప్పుడే అయిపోయిందే, రేపెట్టి నుండి మనకు ఎంటర్టైన్మెంట్ ఏముంది అని బాధపడ్డారు ఆడియన్స్.
అయితే ఈ సీజన్ అయిపోగానే బిగ్ బాస్ హౌస్ సెట్స్ ని పీకేయడానికి బిగ్ బాస్ టీం కి సంబంధించిన వాళ్ళు హౌస్ లోకి రావడం , అందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం చూసి, ఆడియన్స్ బాగా బాధపడుతున్నారు. హౌస్ లో ప్రతీ మూల కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఎదో ఒక జ్ఞాపకం ముడిపడుంది. వాళ్ళు పడిన గొడవలు, సరదాలు, సంతోషాలు, బాధలు ఇలా ఒక్కటా రెండా ఎన్నో ఎమోషన్స్ మనకు ఒక్కసారి మైండ్ లో అలా ఫ్లాష్ అయ్యి వెళ్తుంది. భవిష్యత్తులో సూపర్ హిట్ సీజన్స్ కచ్చితంగా వస్తాయేమో, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇలాంటి సీజన్ ని మాత్రం మళ్లీ చూడలేము. స్వేచ్ఛమైన తండ్రి కూతురు బంధం, తల్లి కొడుకుల బంధం, స్నేహ బంధం, అన్నాదమ్ముల బంధం, ఇలా ఒక్కటా రెండా ఒక అద్భుతమైన ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఈ సీజన్ ని మనం చూడొచ్చు.
ఈ సీజన్ లో మనం చూసిన కంటెస్టెంట్స్ మధ్య బంధాలు బయట కూడా కొనసాగుతాయో లేదో తెలియదు కానీ, అప్పుడప్పుడు అయినా ఈ కంటెస్టెంట్స్ పలు టీవీ షోస్ లో కనిపిస్తూ ఉంటారు కాబట్టి, అభిమానులకు పెద్దగా మిస్సింగ్ అయిన ఫీలింగ్ రాకపోవచ్చు. ఇకపోతే వచ్చే వారం నుండి స్టార్ మా ఛానల్ బిగ్ బాస్ కి బదులుగా ‘BB జోడి 2’ డ్యాన్స్ ప్రోగ్రాం మొదలు కానుంది. ఈ ప్రోగ్రాం ద్వారా పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ తో పాటు, సీజన్ 9 కి సంబంధించిన కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు. సీజన్ 9 నుండి కచ్చితంగా డిమోన్ పవన్, రీతూ చౌదరి వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. తనూజ కూడా కంటెస్టెంట్ గా రాబోతుంది కానీ, ఆమె కళ్యాణ్ తో వస్తుందా?, లేదా ఇమ్మానుయేల్ తో వస్తుందా అనేది చూడాలి.