
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలవరం ముంపు మండలాల్లో మంగళవారం పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు ఈ పర్యటన కొనసాగుతుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల సమస్యలు విని వారికి తగిన సూచనలు చేస్తున్నారు. ఇవాళ భద్రాచలం, టేకులబోరు, శ్రీరామగిరి, చింతూరులో లోకేష్ పర్యటిస్తారు. బుధవారం రంపచోడవరం, దేవీపట్నం, పెదవేంపల్లి, ఇందుకూరు, ముసిరిగుంట, కృష్ణునిపాలెంలో లోకేష్ పర్యటిస్తారు.