
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరి నాకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అని చెప్పడం చరిత్రలో ఎప్పడైనా చేశామా అని తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ అన్నారు. కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామానికి చెందిన షేక్ హాజీరా హత్య కేసును సీఎం జగన్ నీరుగారుస్తున్నారని విమర్శించారు. అప్పట్లో ఆయేషా మీరా కేసును వైఎస్ఆర్, ఇప్పుడు హాజీరా కేసుని సీఎం జగన్ నీరుగార్చారని మండిపడ్డారు. స్వాతంత్ర్యదినోత్సవం రోజున కూడా మహిళలు స్వేచ్చగా తిరిగే పరిస్థితి ఏపీలో లేదని విమర్శించారు. రమ్య, తేజస్విని, స్నేహలత, వరలక్ష్మిలు మీ కూతురిలాంటి వాళ్లు కాదా అని ప్రశ్నించారు. చెల్లికే రక్షణ కల్పించలేని వ్యక్తి రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని విమర్శించారు.