spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Hindupuram firing incident : నందమూరి బాలకృష్ణ ఇలాకాలో కాల్పుల కలకలం..సంచలనం రేపుతున్న వీడియోలు!

Hindupuram firing incident : నందమూరి బాలకృష్ణ ఇలాకాలో కాల్పుల కలకలం..సంచలనం రేపుతున్న వీడియోలు!\

Hindupuram firing incident : పోలీస్, రౌడీ షీటర్ల మధ్య గొడవలు ఏ రేంజ్ లో ఉంటాయి అనేది కేవలం మనం సినిమాల్లో మాత్రమే చూస్తూ పెరిగాము. కానీ నిజ జీవితం లో ఎప్పుడూ కూడా లైవ్ లో చూసి ఉండము, ఇలాంటి ఘటనలు తరచూగా సీమ లోని కొన్ని ప్రాంతాల్లో, అదే విధంగా పల్నాడు లోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. నేడు ఇలాంటి ఘటన నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇలాకా, అనగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. వీటిని చూసిన నెటిజెన్స్ అచ్చం సినిమాలో చూసినట్టుగానే ఉందని అంటున్నారు. ఇంతకీ అసలు ఏమి జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లి చూద్దాం.

వివరాల్లోకి వెళ్తే హిందూపురం లో నాగేంద్ర అనే పేరు మోసిన రౌడీ షీటర్ ఉన్నాడు. ఈయనపై ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కలిపి 90 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. దీనిని బట్టీ ఏ రేంజ్ రౌడీ షీటర్ అనేది అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు, హిందూ పురంలో జరిగిన అత్తా కోడళ్ళు పై గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర ప్రధాన నిందితుడు కూడా. అయితే ఇతను ఇప్పుడు ఇంతకు తెగించాడంటే, ఏకంగా పోలీసుల పై దాడి చేసే స్థాయికి తెగించాడు. హిందూపురం సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవి లపై ఈయన కత్తి తో దాడి చేశాడు. అనంతరం పరుగులు తీస్తున్న నాగేంద్ర పై సీఐ ఆంజనేయులు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక బుల్లెట్ నాగేంద్ర కాలు లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హిందూ పురం నియోజగవర్గంలోని, చిలమత్తూరు మండలం, ఎర్రకొండ అటవీ ప్రాంతంలో జరిగింది. ప్రత్యేకంగా ఈ ఘటన బాలకృష్ణ ఎమ్మెల్యే గా ఉన్న హిందూపురం ప్రాంతం లో జరగడం తో సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఆ వీడియోలను మీరు కూడా క్రింద చూసేయండి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular