
సీబీఎస్ఈ విద్యార్థులు తమ పాఠశాల సర్టిఫికెట్లలో పేరు మార్పుకోసం అభ్యర్థించవచ్చని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రుల పేరు మార్పును అనుమతించని నిబంధనలను సవరించాలని విద్యాశాఖకు సూచించింది. సీబీఎస్ఈ నిబంధనల చెల్లుబాటుపై పలు హైకోర్టులో నుంచి సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీళ్లపై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. గుర్తింపు హక్కు భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని ధర్మసనం తెలిపింది. సీబీఎస్ఈ విద్యార్థులు తమ లేదా తమ తల్లిదండ్రుల పేర్లను మార్చుకోవచ్చని పేర్కొంది.