
ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారం అయిన రాజీవ్ ఖేల్ రత్న పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారు. ఈ అవార్డు పేరును మార్చాలని తనకు దేశ వ్యాప్తంగా పౌరుల నుంచి అనేక వినతులు అందాయని ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్ లో వెల్లడించారు. వాళ్ల సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మారుస్తున్నట్లు ప్రకటించారు.