
నాగార్జుసాగర్ నియోజవర్గ ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి 150 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. హాలియా, నందికొండ అభివృద్ధికి రూ. 15 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జలాలపై రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తెరాసను గెలిపించినందుకు ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తనకు కరోనా సోకడంతో నియోజకవర్గానికి రావడం ఆలస్యమైందన్నారు.