Homeఎంటర్టైన్మెంట్Naga Vamsi : సక్సెస్ వచ్చింది.. మరోసారి నోటికి పని చెప్పిన నాగవంశీ.. వీడియో వైరల్..

Naga Vamsi : సక్సెస్ వచ్చింది.. మరోసారి నోటికి పని చెప్పిన నాగవంశీ.. వీడియో వైరల్..

Naga Vamsi : నిర్మాత నాగవంశీ మాట్లాడే మాటలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ వైరల్ అవుతుంటాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ప్రతీ సినిమా విడుదలకు ముందు ఆయన ఫిల్టర్ లేకుండా, ఒక రకమైన యాటిట్యూడ్ తో మాట్లాడే మాటలు యూత్ కి బాగా నచ్చుతాయి. అందుకే ఏ నిర్మాతకు రానంత క్రేజ్ నాగవంశీ కి వచ్చింది. అయితే ‘వార్ 2’ సినిమా ఎఫెక్ట్ కారణంగా , తన మాటలను అదుపులో పెట్టుకోవడం మొదలు పెట్టారు నాగవంశీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఇచ్చిన ప్రసంగాన్ని ఇప్పటికీ మర్చిపోలేరు ఆడియన్స్. తీవ్రమైన ట్రోల్స్ కి గురయ్యారు. ఈ చిత్రం తర్వాత ఆయన నుండి విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఈవెంట్స్ లో కూడా తనలోని వింటేజ్ యాంగిల్ ని బయటకు తీయలేదు.

కానీ ‘లెనిన్’ సక్సెస్ మీట్ లో తనలోని వింటేజ్ యాంగిల్ ని బయటకు తీశారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా వసూళ్ల గురించి నాగ వంశీ మాట్లాడుతూ ‘ ఇంతకు ముందు థియేటర్స్ కి జనాలు రావడం లేదని బాధపడేవాళ్ళం, కానీ ఈ చిత్రానికి మేము డిస్ట్రిబ్యూటర్స్ కి అదనపు థియేటర్స్ యాడ్ చెయ్యమని చెప్తున్నాము. ఆ రేంజ్ లో ఉన్నాయి వసూళ్లు. సాధారణంగా ఇలాంటి డిమాండ్ సంక్రాంతి సీజన్ లో ఉంటుంది , ఎందుకంటే ఎక్కువ సినిమాలు విడుదల అవుతాయి కాబట్టి , కానీ మా సినిమా సోలో గా విడుదల చేసినప్పటికీ కూడా స్క్రీన్స్ ని పెంచమని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడింది’.

‘నాగార్జున గారు ఒక సినిమాకు ఎమోషనల్ అవ్వడం ఇన్నేళ్ళుగా నేను ఎప్పుడూ చూడలేదు. ఈ సినిమా విడుదలకు ముందు నాగార్జున గారికి విడుదల తర్వాత మాట్లాడుతాను అని చెప్పాను. సాధారణంగా అన్నపూర్ణ స్టూడియోస్ కి సంబంధించిన సినిమాలు వాళ్ళ ఎడిటింగ్ రూమ్ లోనే జరుగుతాయి. మా సితార ఎంటర్టైన్మెంట్స్ భాగం అయ్యినప్పటికీ, అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున గారు కంఫర్ట్ ఫీల్ అవుతారు. కానీ మా ఎడిటర్ ఒక పెద్ద సైకో, అతనికి సితార ఎంటర్టైన్మెంట్స్ అనుకూలంగా ఉంటుంది , అన్నపూర్ణ స్టూడియోస్ అయితే రాను అని చెప్పడంతో , నాగార్జున గారు మా సితార ఎంటర్టైన్మెంట్స్ ఎడిటింగ్ రూమ్ కి వచ్చి ప్రతీ రోజు దగ్గరుండి మానిటర్ చేసేవారు. ఆ స్థాయిలో డెడికేషన్ చూపించారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా నాగవంశీ ఏమేమి మాట్లాడారో ఈ క్రింది వీడియోలో చూడండి , ఆయన మార్క్ స్పీచ్ ఇచ్చాడనే చెప్పొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular